Sanghatanam Oka Yagyam
The beautiful geet we are learning in our Balagokulam sessions until Vijayadashami.
సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరు నవ్వులం || సంఘటనం || గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తనకోసం ఏనాడైనా మిల మిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తనకోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది ఈ మార్గం ఆత్మలో నివేదనం అమ్మకు నీరాజనం || సంఘటనం || భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆజన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా ఆనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమిదీ ఋణం || సంఘటనం || మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమ్మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయహే మాతరం జయం జయం భారతం || సంఘటనం || संघटनं ऒक यज्ञं समिधग मन जीवनं भरतमात पादालकु मुव्वलं आमॆ मोमु पैन चिरु नव्वुलं || संघटनं || गलगल पारे आ जलपातं निलिचिंदा तनकोसं एनाडैना मिल मिल मॆरिसे ऒक अग्नि कणं मिगिलिंदा तनकोसं ए क्षणमैना तरतराल भारतीय तापसुलदि ई मार्गं आत्मलो निवेदनं अम्मकु नीराजनं || संघटनं || भूमि पॊरललो पुरुडुनु पोसे रॆౖतु रासाडा तन पेरुनु एनाडैना आजन्मांतं सेवलु चेसे तल्लि अडिगिंदा आनवालु एनाडैना आनामिकत संदेशं हैंदव जीवन सारं जननि जन्म कारणं जन्मभूमिदी ऋणं || संघटनं || ममतल सिरुलै तन्मय झरुलै मनं सागालि समरम्मुन सागिन शरमै कोवॆल गंटै कोटि आशल पंटै मनं म्रोगालि जनपदाल गुंडॆल स्वरमै कर्मफलं आशिंचनि धर्म वीरुलं मनं जय जयहे मातरं जयं जयं भारतं || संघटनं || saṃghaṭanaṃ Oka yajñaṃ samidhaga mana jīvanaṃ bharatamāta pādālaku muvvalaṃ ām momu paina ciru navvulaṃ || saṃghaṭanaṃ || galagala pāre ā jalapātaṃ niliciṃdā tanakosaṃ enāḍainā mila mila mrise Oka agni kaṇaṃ migiliṃdā tanakosaṃ e kṣaṇamainā taratarāla bhāratīya tāpasuladi ī mārgaṃ ātmalo nivedanaṃ ammaku nīrājanaṃ || saṃghaṭanaṃ || bhūmi pralalo puruḍunu pose rౖtu rāsāḍā tana perunu enāḍainā ājanmāṃtaṃ sevalu cese talli aḍigiṃdā ānavālu enāḍainā ānāmikata saṃdeśaṃ haiṃdava jīvana sāraṃ janani janma kāraṇaṃ janmabhūmidī ṛṇaṃ || saṃghaṭanaṃ || mamatala sirulai tanmaya jharulai manaṃ sāgāli samarammuna sāgina śaramai kovla gaṃṭai koṭi āśala paṃṭai manaṃ mrogāli janapadāla guṃḍla svaramai karmaphalaṃ āśiṃcani dharma vīrulaṃ manaṃ jaya jayahe mātaraṃ jayaṃ jayaṃ bhārataṃ || saṃghaṭanaṃ ||